Sun Mar 15 2026 10:47:39 GMT+0530 (India Standard Time)
ఎయిర్ ఇండియా విమానం ఇంజిన్ లో మంటలు.. అత్యవసర ల్యాండింగ్
ఎయిర్ఇండియా విమానం ఇంజిన్ లో మంటలు వచ్చాయి. దీంతో అత్యవసరంగా విమానాన్ని ల్యాండింగ్ చేశారు

ఎయిర్ఇండియా విమానం ఇంజిన్ లో మంటలు వచ్చాయి. దీంతో అత్యవసరంగా విమానాన్ని ల్యాండింగ్ చేశారు. బెంగళూరు నుంచి కొచ్చి వెళుతున్న ఎయిర్ ఇండియా విమానంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో గమనించిన పైలట్ వెంటనే బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయంలో అత్యవసరంగా దించేశారు.
విమానంలో...
మంటలను వెంటనే సిబ్బంది అదుపులోకి తెచ్చారు. ఇంజిన్ లో మంటలు వచ్చిన సమయంలో విమానంలో 179 మంది ప్రయాణికులు ఉన్నారని ఎయిర్ ఇండియా వర్గాలు వెల్లడించాయి. వారితో పాటు ఆరుగురు సిబ్బంది కూడా ఉన్నారు. అయితే అందరూ సురక్షితంగా ఉన్నారని, ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడ్డారని ఎయిర్ ఇండియా తెలిపింది.
Next Story

