Fri Dec 05 2025 19:56:31 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఈడీ ఎదుటకు సోనియా
ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నేడు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని విచారించనుంది

ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నేడు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని విచారించనుంది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీని విచారణకు రావాలని గత నెలలోనే ఈడీ కోరింది. అయితే కరోనా వైరస్ సోకడంతో ఆమె తాను విచారణకు హాజరు కాలేనని పేర్కొంది. దీంతో అప్పుడు రాహుల్ గాంధీని ఈడీ విచారించింది. ఐదు రోజుల పాటు ఈడీ విచారించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా నిరసనలను తెలియజేసింది.
పార్లమెంటు సమావేశాలు...
మరోసారి ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సోనియా గాంధీని విచారణకు రావాలని కోరింది. ఈరోజు సోనియా విచారణకు హాజరుకానున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి మనీ ల్యాండరింగ్ జరిగినట్లు అనుమానం రావడంతో ఈడీ గాంధీ కుటుంబ సభ్యులను వరసగా విచారణ చేస్తుంది. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో విచారణకు పిలవడంతో ఉభయసభల్లో కాంగ్రెస్ ఈ అంశాన్ని లేవనెత్తే అవకాశముంది.
Next Story

