Fri Dec 05 2025 14:14:55 GMT+0000 (Coordinated Universal Time)
తమిళనాడులో ఈడీ సోదాలు
తమిళనాడు లిక్కర్ స్కాంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు స్పీడ్ పెంచారు

తమిళనాడు లిక్కర్ స్కాంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు స్పీడ్ పెంచారు. టాస్మాక్ అధికారుల ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు చేస్తున్నారు. ఉదయం నుంచి ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. చెన్నై నగరంతో పాటు మొత్తం ఇరవై ప్రాంతాల్లో ఈడీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. తమిళనాడులో లిక్కర్ స్కామ్ జరిగిందన్న ఆరోపణలపై ఈ సోదాలు నిర్వహిస్తున్నారు.
లిక్కర్ వ్యాపారంలో...
తమిళనాడులో లిక్కర్ వ్యాపారంలో అధికార పార్టీకి చెందిన నేతలు, అధికారులు కలసి వెయ్యి కోట్ల స్కాం జరిగిందని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో న్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. అనేక కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. గతంలోనూ ఈడీ అధికారులుసోదాలు చేసిన నేపథ్యంలో మరోసారి దాడులు తమిళనాడు అధికార పార్టీలో కలకలం రేపాయి.
Next Story

