Wed Dec 10 2025 17:52:13 GMT+0000 (Coordinated Universal Time)
Delhi liqour scam : సీఎం పీఏకు ఈడీ సమన్లు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు స్పీడ్ పెంచారు. కేజ్రీవాల్ పీఏకు ఈడీ సమన్లు జారీ చేసింది

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు స్పీడ్ పెంచారు. ఇప్పటికే పలువురిని ఈ కేసులో అరెస్ట్ చేసిన ఈడీ, సీబీఐ అధికారులు మరికొందరిని విచారించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేజ్రీవాల్ పీఏకు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సమన్లు జారీ చేశారు.
వరస అరెస్ట్ లతో...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీతో పాటు సీబీఐ అధికారులు కూడా పూర్తి దృష్టి పెట్టారు. ఇటీవల వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. మరోవైపు ఆడిటర్ బుచ్చిబాబును సీబీఐ అధికారులు విచారించేందుకు కోర్టు అనుమతించింది. దీంతో రానున్న కాలంలో మరికొందరి అరెస్ట్లుంటాయన్న ప్రచారం సాగుతుంది.
Next Story

