Sat Mar 07 2026 22:45:26 GMT+0530 (India Standard Time)
కేజ్రీవాల్ కు మరోసారి నోటీసులు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. నాలుగోసారి ఈడీ అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 18వ తేదన విచారణకు హాజరు కావాలని ఆయనకు నోటీసులు ఇచ్చారు.
విచారణకు గైర్హాజరు...
అయితే గతంలో మూడు సార్లు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసినా అరవింద్ కేజ్రీవాల్ మాత్రం విచారణకు హాజరు కాలేదు. అయితే తనను అరెస్ట్ చేయడానికే ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారని అరవింద్ కేజ్రీవాల్ చెబుతున్నారు. ఈడీ అధికారులు పంపిన నోటీసులు చట్టపరమైనవి కావని ఆయన అన్నారు. ఈసారైనా విచారణకు అరవింద్ కేజ్రీవాల్ ఈడీ అధికారుల ఎదుటకు వస్తారా? లేరా? అన్నది చూడాల్సి ఉంది.
Next Story

