Fri Dec 05 2025 20:24:23 GMT+0000 (Coordinated Universal Time)
మాజీ సీఎం కుమారుడి ఇంట్లో ఈడీ సోదాలు
ఛత్తీస్ ఘడ్ మాజీ ముఖ్యమంత్రి కుమారుడి నివాసంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల సోదాలు నిర్వహించారు.

ఛత్తీస్ ఘడ్ మాజీ ముఖ్యమంత్రి కుమారుడి నివాసంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల సోదాలు నిర్వహించారు. చైతన్య భగేల్ నివాసంలో ఈడీ అధికారుల తనిఖీలు జరిపారు. లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా సోదాలు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలో అధికారంలో ఉంగా అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు రావడంతో ఈడీ రంగంలోకి దిగింది.
లిక్కర్ సిండికేట్ నుంచి...
లిక్కర్ యజమానుల నుంచి ప్రతి నెలా 2,161 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ఆరోపణలు రావడంతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు రంగంలోకి దిగి సోదాలు నిర్వహిస్తున్నారు. మద్యం సిండికేట్ ద్వారా వసూళ్లు చేసినట్టు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు గుర్తించారు. ఇప్పటికే 205 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది
Next Story

