Wed Mar 18 2026 21:46:48 GMT+0530 (India Standard Time)
Kejrival : కేజ్రీవాల్ ఇంటికెళ్లే రహదారులన్నీ బ్లాక్... ఏం జరుగుతుంది?
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు వచ్చే అవకాశముంది

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు వచ్చే అవకాశముంది. ఆయన ఈడీ విచారణకు రాకపోవడంతో ఈడీ అధికారులే ఆయన ఇంటికి వెళ్లి సోదాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటికే ఢిల్లీలోని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంటికి వెళ్లే రహదారులన్నింటినీ పోలీసులు బ్లాక్ చేయడంతో ఆయనను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో...
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారణకు ఈడీ అధికారులు మూడుసార్లు పిలిచినా ఆయన హాజరుకాకపోవడంతో అధికారులు నేరుగా వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆయన ఇంట్లో సోదాలు జరిపితేనే నిజాలు తెలుస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కూడా కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తే ఏం చేయాలన్న దానిపై సమాలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే వారు ఎంతటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ట్వీట్ చేశాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Next Story

