Tue Jan 20 2026 08:37:09 GMT+0000 (Coordinated Universal Time)
మూడు రాష్ట్రాల్లో ఈడీ 21 ప్రాంతాల్లో సోదాలు
కేరళ, కర్ణాటక, తమిళనాడులో ఈడీ అధికారుల సోదాలు జరుపుతున్నారు.

కేరళలో శబరిమల బంగారం చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేరళ, కర్ణాటక, తమిళనాడులో ఈడీ అధికారుల సోదాలు జరుపుతున్నారు. దేవస్థానం బోర్డు మాజీ అధ్యక్షుడి ఇంట్లో ఈడీ తనిఖీలు నిర్వహిస్తుంది. మూడు రాష్ట్రాల్లోని ఇరవై ఒక్క ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బృందాలుగా విడిపోయి ఈ సోదాలను నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో జరుపుతున్న ఈ సోదాల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారని సమాచారం.
అయ్యప్ప దేవాలయంలో...
ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉన్ని కృష్ణన్ పొట్టితో పాటు ట్రావన్ కోర్ దేవస్థానం బోర్డు మాజీ అధ్యక్షుడు పద్మకుమార్ ల సంబంధీకులు, సన్నిహితుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇదే కేసులో కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపట్టింది. అయితే ఈ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఎంట్రీ ఇవ్వడంతో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి.
Next Story

