Sun Feb 01 2026 18:06:07 GMT+0000 (Coordinated Universal Time)
మనీష్ సిసోడియా మరోసారి అరెస్ట్
మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసింది.

మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసింది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న మనీష్ సిసోదియాను ఈడీ అదుపులోకి తీసుకుంది. రేపు మనీష్ సిసోడియా బెయిల్ పిటీషన్ పై కోర్టులో వాదనలు జరగనున్నాయి.
మనీలాండరింగ్...
ఈ నేపథ్యంలో మనీలాండరింగ్ కింద మనీష్ సిసోడియాను అరెస్ట్ చేయడంతో ఆయన మరికొంత కాలం జైలులో ఉండే అవకాశముంది. సిసోడియాను కూడా ఈడీ అధికారులు కస్టడీని కోరే అవకాశముంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఆయనను అరెస్ట్ చేసి తీహార్ జైలులో ఉంచిన సంగతి తెలిసిందే.
Next Story

