Wed Mar 18 2026 16:13:05 GMT+0530 (India Standard Time)
కేజ్రీవాల్‌కు ఏడోసారి నోటీసులు... 26న విచారణకు రావాలంటూ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణకు కావాలని ఆయనకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నెల 26వ తేదీన తమ కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరుకావాలని, కేసు దర్యాప్తుకు సహకరించాలని ఈడీ ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు.
గతంలో ఆరుసార్లు...
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు ఆరు సార్లు నోటీసులు జారీ చేసినా వివిధ కారణాలు చెప్పి హాజరు కాలేదు. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఈడీ విచారణకు హాజరు కావాలని కేజ్రీవాల్ ను ఆదేశించింది. ఇప్పుడు తాజాగా మరోసారి నోటీసులు జారీ చేయడంతో ఈసారి కేజ్రీవాల్ హాజరవుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story

