Tue Mar 03 2026 14:10:46 GMT+0530 (India Standard Time)
Breaking : ఛత్తీస్గడ్ లో భారీ ఎన్కౌంటర్.. ఎనిమిది మంది మావోయిస్టుల మృతి
ఛత్తీస్గడ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో ఎనిమిది మంది మావోయిస్టులు మరణించారు

ఛత్తీస్గడ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో ఎనిమిది మంది మావోయిస్టులు మరణించారు. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ఒక జవాను మృతి చెందగా మరో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. ఇటీవల కాలంలో ఛత్తీస్గడ్ లో ఎన్కౌంటర్ లు జరుగుతున్నాయి. అధిక సంఖ్యలో మావోయిస్టులు మరణిస్తున్నారు.
వరస ఎన్కౌంటర్లతో...
ఛత్తీస్గడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతుంది. భద్రతాదళాలు కూంబింగ్ ను కొనసాగిస్తున్నాయి. భద్రతాదళాలు కూంబింగ్ చేసే సమయంలో మావోయిస్టులు ఎదురుపడగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈకాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు, ఒక జవాను మరణించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story

