Fri Dec 05 2025 16:07:20 GMT+0000 (Coordinated Universal Time)
బారాముల్లాలో ఎన్ కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు మృతి
బారాముల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు

బారాముల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. టెర్రరిస్టుల నుంచి పెద్దయెత్తున మందుగుండు సామగ్రతో పాటు ఇతర ఆయుధాలను కూడా భధత్రాదళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ మేరకు సైన్యం ప్రకటించింది. నిన్న జమ్మూకాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో బారాముల్లాలో చొరబాటుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి.
ప్రత్యేక విమాన సర్వీసులు...
మరో వైపు ఉగ్రవాది దాడుల నేపథ్యంలో ప్రత్యేక విమాన సర్వీసులను నడుపుతున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. హోంమంత్రి అమత్ షాతో మాట్లాడిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నాలుగు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శ్రీనగర్ నుంచి ముంబయి, ఢిల్లీకి ప్రత్యేక విమానాలు చేరుకుంటాయని రామ్మోహన్ నాయుడు తెలిపారు.
Next Story

