Sat Jan 03 2026 12:35:39 GMT+0000 (Coordinated Universal Time)
ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్..12 మంది మావోల మృతి
ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో పన్నెండు మంది మావోయిస్టులు మరణించారు

ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో పన్నెండు మంది మావోయిస్టులు మరణించారు. ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలోని మావోయిస్టులకు, భద్రతాదళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో పన్నెండు మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక నేత మరణించినట్లు సమాచారం.
మృతుల్లో కీలక నేత...
మావోయిస్టు కొంటా ఏరియా కమిటీ కార్యదర్శి మంగడు కూడా ఈ ఎదురు కాల్పుల్లో మరణించాడని తెలిసింది. ఈ ఎదురుకాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టులపై రివార్డులు కూడా ఉన్నాయి. సంఘటన స్థలం నుంచి ఏకే 47 రైఫిల్స్ తో పాటు మరికొన్ని ఆయుధ సామాగ్రిని కూడా భద్రతాదళాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులువెల్లడించారు.
Next Story

