Fri Dec 05 2025 09:31:26 GMT+0000 (Coordinated Universal Time)
జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు.. రాజౌరి ప్రాంతంలో
జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్ జరిగింది. రాజౌరిలో పోలీసు బృందంపై ఉగ్రవాదులు కాల్పుులు జరిపారు

జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్ జరిగింది. రాజౌరిలో పోలీసు బృందంపై ఉగ్రవాదులు కాల్పుులు జరిపారు. రాజౌరి జిల్లాలో కోట్రంకా పోలీస్ స్టేషన్ పరిధిలోని మందిర్ గాలా పైన ఉన్న ధేరి ఖతుని ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడుతున్న జమ్మూ కాశ్మీర్ పోలీసులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు సమాచారం అందుతుంది.
గాలింపు చర్యలు...
కాల్పులు జరిగిన ప్రాంతంలో ఒక్కసారిగా ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే జమ్మూకాశ్మీర్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అదనపు భద్రతాదళాలను రప్పించారు. అయితే ఉగ్రవాదుల కోసం ఇంకా గాలిస్తున్నారు. ఉగ్రవాదులు ఎక్కడైనా దాక్కుని ఉంటారన్న అనుమానంతో ఆ ప్రాంతమంతా అణువణువూ గాలిస్తున్నారు. ఉగ్రవాదులు పోలీసు బృందాలపై కాల్పులు జరపడంతో అదనపు భద్రతాదళాలు అక్కడకు చేరుకుని ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నాయి.
Next Story

