Fri Dec 05 2025 20:18:17 GMT+0000 (Coordinated Universal Time)
రేపు పోలింగ్.. నేటితో ప్రచారానికి తెర
రెండు రాష్ట్రాల్లో ఎన్నికలకు నేటి సాయంత్రంతో ప్రచారానికి తెర పడనుంది. ఉత్తరాఖండ్ ,గోవాల్లో ఎన్నికలు రేపు జరగనున్నాయి.

రెండు రాష్ట్రాల్లో ఎన్నికలకు నేటి సాయంత్రంతో ప్రచారానికి తెర పడనుంది. ఉత్తరాఖండ్ గోవా రాష్ట్రాల్లో ఎన్నికలు రేపు జరగనున్నాయి. ఒకే విడతలో ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. దీంతో గోవా, ఉత్తరాంఖండ్ రాష్ట్రాల్లో నేటితో ప్రచారం ముగియనుంది. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. అయితే ఎన్నికలు రేపు జరిగినా ఫలితాల కోసం మార్చి 10వ తేదీ వరకూ వేచి చూడాల్సి ఉంది.
ఏర్పాట్లు పూర్తి.....
గోవాలో నలభై అసెంబ్లీ స్థానలకు, ఉత్తరాఖండ్ లో 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలు తమ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాయి. ఈరోజు సాయంత్రంతో ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. రేపటి పోలింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
- Tags
- uttarakhand
- goa
Next Story

