Mon Dec 15 2025 00:06:09 GMT+0000 (Coordinated Universal Time)
Prasanth Kishore : ఎగ్జిట్ పోల్స్ పై ప్రశాంత్ కిషోర్ ఏమన్నారంటే?
ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు.

ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు. ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో తాను చెప్పింది నిజమవుతుందని ప్రశాంత్ కిషోర్ మరోసారి చెప్పారు. మరోసారి ఎన్నికల్లో టైమ్ వేస్ట్ చేసుకోవద్దని ప్రశాంత్ కిషోర్ సూచించారు. పనికిమాలిన చర్చలతో టైమ్ వేస్ట్ చేసుకోవద్దని ప్రశాంత్ కిషోర్ సీనియర్ జర్నలిస్టులను పరోక్షంగా విమర్శించారు.
ఫేక్ జర్నలిస్టులు...
మరోసారి ఫేక్ జర్నలిస్టులు, స్వయం ప్రకటిత మేథావుల చర్చలతో టైమ్ వేస్ట్ చేసుకోవద్దంటూ ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు. ప్రశాంత్ కిషోర్ కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని చెప్పారు. అలాగే ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోతుందని కూడా ఆయన చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ తర్వాత కూడా తన అభిప్రాయానికి కట్టుబడి ఉన్నానని చెప్పారు ప్రశాంత్ కిషోర్.
Next Story

