Sun Mar 15 2026 03:12:32 GMT+0530 (India Standard Time)
కాంగ్రెస్ పై పీకే మరోసారి ఫైర్
కాంగ్రెస్ పై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి ఫైర్ అయ్యారు.

కాంగ్రెస్ పై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ మీద నిప్పులు చెరిగారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ పై ప్రశాంత్ కిషోర్ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన తాజాగా చేసిన ట్వీట్ సయితం కాంగ్రెస్ ను ఇబ్బందిపెట్టే విధంగానే ఉంది. తాజా ప్రశాంత్ కిషోర్ చేసిన ట్వీట్ పై విమర్శలు కూడా విన్పిస్తున్నాయి. టీఎంసీకి పీకే తొత్తుగా వ్యవహరిస్తున్నారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.
నాయకత్వం....
ప్రశాంత్ కిషోర్ తన ట్వీట్ లో విపక్షాలకు నాయకత్వం వహించడం దేవుడిచ్చిన హక్కుగా కాంగ్రెస్ భావిస్తుందన్నారు. విపక్షాలకు నాయకత్వం వహించే హక్కు కాంగ్రెస్ కు లేదన్నారు ప్రశాంత్ కిషోర్. పదేళ్లలో 90 శాతం ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలయిందని ఆయన అన్నారు. ఎవరు నాయకత్వం వహించాలో విపక్షాలే నిర్ణయించుకోవాలని ప్రశాంత్ కిషోర్ కోరారు.
Next Story

