Tue Mar 10 2026 01:16:10 GMT+0530 (India Standard Time)
కాంగ్రెస్ అధ్కక్ష ఎన్నిక అక్టోబరు17న
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. అక్టోబరు 17వ తేదీన ఎన్నిక జరగనుంది

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. అక్టోబరు 17వ తేదీన ఎన్నిక జరగనుంది. సెప్పంబరు 22న ఈ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ మీడియాకు తెలిపారు. కాంగ్రెస్ వర్క్ంగ్ కమిటీ ఈరోజు సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో ఉన్న సోనియాగాంధీ ఈ సమావేశాన్ని వర్చువల్ గా నిర్వహించారు.
వచ్చే నెలలో నామినేషన్లు....
సీడబ్ల్యూసీ నిర్ణయం మేరకు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి అక్టోబరు 19వ తేదీన ఫలితాలను వెల్లడిస్తారు. సెప్టంబరు 24వ తేదీ నుంచి 30 వ తేదీ వరకూ అధ్యక్ష ఎన్నిక కోసం నామినేషన్లను స్వీకరిస్తారు. ఎవరైనా నామినేషన్లు వేయవచ్చని కాంగ్రెస్ ఎంపీ వేణుగోపాల్ తెలిపారు. రాహుల్ గాంధీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. రాహుల్ అధ్యక్ష పదవి చేపట్టాలని దేశ వ్యాప్తంగా శ్రేణులు కోరుతున్నాయి.
Next Story

