Tue Feb 24 2026 12:36:32 GMT+0530 (India Standard Time)
Delhi : నేడు ఎన్నికల సంఘం కీలక భేటీ
నేడు ఢిల్లీలో ఎన్నికల అధికారులు భేటీ కానున్నారు

నేడు ఢిల్లీలో ఎన్నికల అధికారులు భేటీ కానున్నారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. కేంద్ర, రాష్ట్ర అధికారులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఎన్నికల అధికారుల నుంచి పలు అంశాలపై చర్చించనున్నారు. వారి సూచనలు కూడా తీసుకోనున్నారు.
ఈ అంశాలపై చర్చ...
ప్రధానంగా ఈవీఎంలు, ఓటర్ల జాబితా, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ఎన్నికల ప్రక్రియలను బలోపేతం చేయడంపై ప్రధానంగా చర్చించే అవకాశముందని తెలిసింది. ఓటర్ల జాబితా సవరణతో పాటు ఎన్నికల ప్రక్రియలో సాంకేతిక వినియోగం దాని వల్ల జరిగే ఇబ్బందులను కూడా రాష్ట్ర అధికారులు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకు వచ్చే అవకాశముంది.
Next Story

