Thu Mar 19 2026 05:52:23 GMT+0530 (India Standard Time)
రేపో, మాపో నోటిఫికేషన్
ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఎన్నికల కమిషన్ కసరత్తు ప్రారంభించింది. ఐదు రాష్ట్రాల అధికారులతో ఎ సమావేశమయ్యారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఎన్నికల కమిషన్ కసరత్తు ప్రారంభించింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల అధికారులతో ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై సమీక్ష జరగనుంది. తెలంగాణ, రాజస్థాన్, మిజోరాం, మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్ ఎన్నికలు ఈ ఏడాది డిసెంబరు నెలలోపు జరగాల్సి ఉంది.
రెండు విడతలుగా...
ఈరోజు, రేపో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరోంలలో ఒకే విడత పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల అధికారులు దాదాపుగా నిర్ణయించారు. అదే సమయంలో ఛత్తీస్గడ్ లో మాత్రం రెండు విడతలుగా పోలింగ్ నిర్వహించే అవకాశముంది. ఈ మేరకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు.
Next Story

