నాలుగు రాష్ట్రాల ఎన్నికల తేదీలివే.. షెడ్యూల్ ఇదే
దేశంలో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల తేదీని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది

దేశంలో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల తేదీని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, తో పుదుచ్చేరిలకు ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం తమిళనాడులో ఏప్రిల్ 23వ తేదీన పోలింగ్ జరగనుంది. పశ్చిమ బెంగాల్ లో రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశ ఏప్రిల్ 23వ తేదీన, రెండో విడత ఏప్రిల్ 29వ తేదీన పోలింగ్ జరగనుంది. కేరళ, అస్సాం, పుదుచ్చేరిలలో ఏప్రిల్ 9వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ నాలుగు రాష్ట్రాలకు సంబంధించి కౌంటింగ్ మే 4వ తేదీన నిర్వహించనున్నారు. టీవల ఈ రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సన్నాహాలను ఈసీఐ సమీక్షించింది. ఈ సమీక్షల్లో భద్రతా ఏర్పాట్లు, ఓటర్ల జాబితాలు మరియు ఎన్నికల నిర్వహణపై అధికారులు పరిశీలించారు. రేపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.

