Fri Feb 14 2025 18:32:31 GMT+0000 (Coordinated Universal Time)
Delhi : నేడు ఢిల్లీలో ముగియనున్న ఎన్నికల ప్రచారం
నేటితో ఢిల్లీలో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈరోజు సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది

నేటితో ఢిల్లీలో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈరోజు సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఈ నెల 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రధాన పార్టీలైన బీజేపీ, ఆమ్ ఆద్మీపార్టీ, కాంగ్రెస్ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు బీజేపీ తరుపున ప్రచారంలో పాల్గొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీతో పాటు నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేశారు.
ఈ నెల 5వ తేదీన ఎన్నికలు...
ఆమ్ ఆద్మీపార్టీ తరుపున కేజ్రీవాల్ ప్రధానంగా ప్రచార బాధ్యతలను భుజానకెత్తుకోగా, పంజాబ్ ముఖ్యమంత్రి కూడా వచ్చి ఆప్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ నెల 5వ తేదీన ఢిల్లీలో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 70 శాసనసభ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో 36 సీట్లు మ్యాజిక్ ఫిగర్ గా ఉండటంతో మూడు పార్టీలూ గెలుపు కోసం శ్రమిస్తున్నాయి. ఉచితాల పేరుతో ఇప్పటికే మ్యానిఫేస్టోలను విడుదల చేసిన పార్టీలు ప్రజలను తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
Next Story