Thu Mar 19 2026 05:52:18 GMT+0530 (India Standard Time)
మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్ నాధ్ షిండే రాజీనామా
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి ఏక్ నాధ్ షిండే రాజీనామా చేశారు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి ఏక్ నాధ్ షిండే రాజీనామా చేశారు. ఆయన మహారాష్ట్ర గవర్నర్ ను కలసి తన రాజీనామా లేఖను సమర్పించారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గా కొనసాగాలని గవర్నర్ ఈ సందర్భంగా ఏక్ నాధ్ షిండేను కోరారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరన్నది ఇంకా తేలలేదు.
నేడు సీఎం ఎవరో?
ఈరోజు కొత్త ముఖ్యమంత్రి ఎవరో తేలనుంది. మహాయుతిలోని మూడు పార్టీల నుంచి ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి గడువు నేటితో పూర్తి కానుండటంతో నేడు ఖచ్చితంగా ఎవరో ఒకరిని ఎంపిక చేయాల్సి ఉంటుంంది. అత్యధిక స్థానాలను గెలిచిన తమకు సీఎం పదవి ఇవ్వాలని బీజేపీ కోరుతుండగా, తనకు మరోసారి అవకాశమివ్వాలని ఏక్ నాధ్ షిండే కూడా కోరుతున్నారు.
Next Story

