ఒకే ఒక్కడు సీన్.. థాయ్ లాండ్ లో రిపీట్
ఒకే ఒక్కడు సినిమాలో ఒక్కరోజు ముఖ్యమంత్రి చేసే అద్భుతాలను మనమందరం చూశాం.

ఒకే ఒక్కడు సినిమాలో ఒక్కరోజు ముఖ్యమంత్రి చేసే అద్భుతాలను మనమందరం చూశాం. అయితే థాయ్‌లాండ్ ప్రజలు ఒక్కరోజు ప్రధానిని చూశారు. ఒక్క రోజు ప్రధానిగా వ్యవహరించారు థాయ్‌లాండ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ సూరియా జంగ్రుంగ్రియాంగ్కిట్. ప్రస్తుత ప్రధాని పెటోంగ్‌టర్న్ షినవత్రను సస్పెండ్ చేస్తూ కోర్టు ఆదేశాలివ్వడంతో ఒక్కరోజు ప్రభుత్వాన్ని నడిపే అవకాశం సూరియాకు దక్కింది. ప్రధాని హోదా లో బుధవారం బ్యాంకాక్‌లో జరిగిన పీఎంవో 93వ వార్షికోత్సవంలో సూరియా పాల్గొన్నారు.
కాంబోడియా ప్రధాని హున్‌సేన్‌తో ఫోన్ సంభాషణలో సొంత దేశ సైన్యాన్నే కించపరిచారంటూ ఆరోపణలు రావడంతో థాయిలాండ్ యువ మహిళా ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రను న్యాయస్థానం సస్పెండ్ చేసింది. దీంతో ప్రధాని పీఠం ఖాళీ అయింది. రాజకీయ సంక్షోభం తలెత్తకూడదనే ఉద్దేశ్యంతో అధికార పార్టీ వెంటనే సూరియాను ప్రధానిగా ప్రకటించింది. అయితే ఆయన కేవలం 24 గంటలపాటు మాత్రమే ప్రధానమంత్రి హోదా లో కొనసాగారు.