Fri Dec 05 2025 15:54:00 GMT+0000 (Coordinated Universal Time)
Tamilnadu : తమిళనాడు కోల్డ్ రిఫ్ కార్యాలయంలో ఈడీ సోదాలు
తమిళనాడు కోల్డ్ రిఫ్ ఫార్మా కంపెనీపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ కార్యాలయం సోదాలు జరుపుతుంది.

తమిళనాడు కోల్డ్ రిఫ్ ఫార్మా కంపెనీపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ కార్యాలయం సోదాలు జరుపుతుంది. ఇరవై మంది పిల్లల మరణాలకు కారణమైన సిరప్ కు సంబంధించిన శ్రీసన్ ఫార్మా కంపెనీలో దాడులు చేస్తున్నారు. చెన్నైలో మొత్తం ఏడుచోట్ల సోదాలు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో 20 మంది చిన్నారుల ప్రాణాలు తీసిన కోల్డ్ రిఫ్ కాఫ్ సిరప్ తయారీదారు శ్రీసన్ ఫార్మాస్యూటికల్స్‌కు చెందిన కార్యాలయంలో సోమవారం దాడులు చేసింది. ఈ కంపెనీతో పాటు తమిళనాడు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నతాధికారులపై మనీ లాండరింగ్ కేసులో ఈ చర్య చేపట్టినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
దగ్గుమందు ఘటనపై...
చెన్నైలో కనీసం ఏడు చోట్ల ఈడీ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం ఈ చర్య చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో ఐదేళ్ల లోపు ఉన్న 20 మంది చిన్నారులు కోల్డ్ రిఫ్ కాఫ్ సిరప్ సేవించడం వల్ల మృతి చెందినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2011లో తమిళనాడు ఎఫ్.డి.ఏ ఈ కంపెనీకి లైసెన్స్ ఇచ్చింది. కాంచీపురం కేంద్రంగా ఉన్న ఈ సంస్థ దశాబ్దం పైగా సరైన సదుపాయాలు లేకుండా, ఔషధ భద్రతా నిబంధనలు ఉల్లంఘిస్తూ పనిచేస్తూ వచ్చిందని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ తెలిపింది.
Next Story

