Mon Jun 16 2025 13:31:13 GMT+0000 (Coordinated Universal Time)
నేషనల్ హెరాల్డ్ కార్యాలయంలో ఈడీ సోదాలు
నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్పీడ్ పెంచారు.ప్రధాన కార్యాలయంలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్పీడ్ పెంచారు. నేషనల్ హెరాల్డ్ ప్రధాన కార్యాలయంలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కీలకమైన డాక్యుమెంట్లు ఏవైనా లభ్యమవుతాయేమోనన్న అనుమానంతో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. నేషనల్ హెరాల్డ్ ప్రధాన కార్యాలయంతో పాటు ఢిల్లీ పరిసర ప్రాంతంలోని పది ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నారు.
పది చోట్ల...
నిన్న మొన్నటి వరకూ ఇదే కేసులో సోనియా, రాహుల్ ను విచారించిన ఈడీ అధికారులు కొన్ని విషయాలను రాబట్టారు. కేసుకు సంబంధించిన విషయాల్లో పూర్తి స్థాయి నిజాలు తెలుసుకోవడానికి ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. రాజకీయ వేధింపుల్లో భాగంగానే ఈ సోదాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తుంది.
Next Story