Tue Jan 06 2026 03:23:47 GMT+0000 (Coordinated Universal Time)
Earth Quake : భారత్ లో భూ ప్రకంపనలు
భారత్ లో భూ ప్రకంపనలు భయాందోళనలు సృష్టించాయి. రిక్టర్ స్కేల్ పై 5.1 తీవ్రతగా నమోదయిందని అధికారులు వెల్లడించారు

భారత్ లో భూ ప్రకంపనలు భయాందోళనలు సృష్టించాయి. రిక్టర్ స్కేల్ పై 5.1 తీవ్రతగా నమోదయిందని అధికారులు వెల్లడించారు. ఈశాన్య రాష్ట్రంలో వేర్పేరు ప్రాంతాల్లో కనిపించిన భూప్రకంపనలు వణుకు పుట్టించాయి. అస్సాం, త్రిపుర రాష్ట్రాల్లో భూప్రకంపనలు కనిపించాయి. మేఘాలయ రాష్ట్రంలోనూ స్వల్పంగా భూమి కంపించింది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. యాభై కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపింది.
రిక్టర్ స్కేల్ పై...
అస్సాం, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల్లో కలిగిన భూప్రకంపనలతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈరోజు తెల్లవారు జామున ఈ భూప్రకంపనలు సంభవించడంతో కొందరికి నిద్రలో తెలియదు. కొందరు మాత్రం భూమి కంపిస్తుందని తెలిసి ఇళ్ల నుంచి రోడ్లమీదకు వచ్చారు. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 5.1 గా నమోదయినట్లు షనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఇప్పటి వరకూ అందుతున్న సమాచారం మేరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలిసింది. ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.
Next Story

