Mon Feb 02 2026 13:30:44 GMT+0000 (Coordinated Universal Time)
మణిపూర్ లో భూప్రకంపనలు
మణిపూర్ లో భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్ర 3.2 తీవ్రతగా నమోదయినట్లు పేర్కొన్నారు

మణిపూర్ లో భూప్రకంపనలు సంభవించాయి. మణిపూర్ రాష్ట్రంలోని నోనినగర్ లో ఈ భూప్రకంపనలు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్ర 3.2 తీవ్రతగా నమోదయినట్లు పేర్కొన్నారు. భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు ప్రాణాలు చేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు.
ప్రాణభయంతో...
కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు వణికిపోయారు. అయితే ఈ భూప్రకంపనాల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సాధారణంగానే ఇలాంటి ప్రకంపనలు సంభవిస్తుంటాయని చెప్పడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
Next Story

