Sat Dec 13 2025 22:32:17 GMT+0000 (Coordinated Universal Time)
Kerala : కేరళలో భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
కేరళలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో పలు ప్రాజెక్టుల్లో నీటి మట్టం పెరుగుతుంది.

కేరళలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో పలు ప్రాజెక్టుల్లో నీటి మట్టం పెరుగుతుంది. ఇడుక్కి జిల్లాలో భారీ వర్షాలు పడుతుండటంతో ముల్లపెరియర్ ఆనకట్టలో నీటి మట్టం 137 అడుగులను దాటడంతో మూడు గేట్లుఎత్తి నీటిని విడుదల చేశారు. ఉదయం 9 గంటలకు 163 క్యుసెక్కుల నీరు విడుదల చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఉదయం 8 గంటల సమయానికి ఆనకట్టలో నీటి మట్టం 138.25 అడుగులుగా నమోదైనట్లు అధికారులు తెలిపారు.
నీటిని విడుదల చేయడంతో...
తరువాత పరిస్థితులను బట్టి నీటి విడుదల విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు చెప్పారు. పెరియర్ నది తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలను తరలించేందుకు సంబంధిత తహసిల్దార్లకు సూచనలు జారీ చేశారు. విపత్తు నిర్వహణ చర్యలను సమన్వయం చేసేందుకు ఇడుక్కి జాయింట్ కలెక్టర్‌కి బాధ్యతలు అప్పగించారు.
Next Story

