Mon Mar 16 2026 12:22:32 GMT+0530 (India Standard Time)
14 రైళ్లు రద్దు ఇవే.. కొన్ని రైళ్లు దారి మళ్లింపు
విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంతో రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది. అనేక రైళ్లను దారి మళ్లించింది

విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంతో రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది. అనేక రైళ్లను దారి మళ్లించింది. మొత్తం పథ్నాలుగు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వేశాఖ తెలిపింది. ఐదు రైళ్లు దారి మళ్లించినట్లు రైల్వే శాఖ తెలిపింది. నిన్న రాత్రి విజయనగరం జిల్లాలో రెండు ప్యాసింజర్ రైలు ఢీకొన్న ఘటనలో పథ్నాలుగు మంది మరణించిన సంగతి తెలిసిందే. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పట్టాలపై నుంచి బోగీలను రైల్వే సిబ్బంది తొలగించే ప్రక్రియను చేపట్టారు.
రద్దైన రైళ్లు
:రాయ్పూర్-విశాఖపట్నం ప్యాసింజర్
విశాఖపట్నం-రాయ్పూర్ ప్యాసింజర్
పలాస-విశాఖపట్నం స్పెషల్
పారాదీప్-విశాఖపట్నం ఎక్స్ప్రెస్
కోర్బా-విశాఖపట్నం ఎక్స్ప్రెస్
రాయగడ-విశాఖపట్నం ప్యాసింజర్
విజయనగరం-విశాఖపట్నం
విశాఖపట్నం-గుణపూర్ స్పెషల్
Next Story

