Sun Mar 15 2026 13:39:25 GMT+0530 (India Standard Time)
Delhi : ఢిల్లీ ఎయిర్ పోర్టులో మరోసారి డ్రగ్స్ కలకలం
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్రగ్స్ కలకలం రేపింది. కస్టమ్స్ అధికారుల తనిఖీలో డ్రగ్స్ బయటపడ్డాయి.

ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్రగ్స్ కలకలం రేపింది. కస్టమ్స్ అధికారుల తనిఖీలో డ్రగ్స్ బయటపడ్డాయి. 822 గ్రాముల కొకైన్ ఒక ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పొట్టలో దాచి ఉంచిన 77 కొకైన్ క్యాప్సూల్స్ ను కస్టమ్స్ అధికారులు కనుగొని వాటిని బయటకు తీశారు. ప్రయాణికుడు నైరోబి జాతికి చెందిన వారని పోలీసులు చెబుతున్నారు.
పదమూడు కోట్ల రూపాయలు...
స్వాధీనం చేసుకున్న కొకైన్ విలువ పదమూడు కోట్ల రూపాయలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు చెబుతుతున్నారు. అనుమానం వచ్చి వైద్యుల చేత కెన్యా నుంచి వస్తున్న ప్రయాణికుడి పొట్టలో పరీక్షించగా ఇవి బయటపడ్డాయి. అతనిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఢిల్లీ ఎయిర్ పోర్టు లోని కస్టమ్స్ అధికారులు తెలిపారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story

