Thu Jan 29 2026 14:49:20 GMT+0000 (Coordinated Universal Time)
DIVYASTRA:దివ్యాస్త్ర ఫస్ట్ టెస్ట్ సక్సెస్.. మోదీ అభినందనలు
డీఆర్డీవో మిషన్ దివ్యాస్త్ర ఫస్ట్ టెస్ట్ విజయవంతం అయింది. అగ్ని-5 ను డీఆర్డీవో రూపకల్పన చేసింది

డీఆర్డీవో మిషన్ దివ్యాస్త్ర ఫస్ట్ టెస్ట్ విజయవంతం అయింది. మిషన్ దివ్యాస్త్రలో భాగంగా అగ్ని-5 డీఆర్డీవో రూపకల్పన చేసింది. అగ్ని-5 తొలి పరీక్ష విజయవంతమయింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. డీఆర్డీవో శాస్త్రవేత్తలను మోదీ అభినందించారు. ఈ విజయం ఢిఫెన్స్ సామర్థ్యం మరింత పెరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలెప్మెంట్ ఆర్గనైజేషన్ సైంటిస్టులను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.
స్వదేశీ పరిజ్ఞానంతో...
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అగ్ని 5 క్షిపణి తొలి పరీక్ష విజయవంతం కావడం శాస్త్రవేత్తల కృషికి నిదర్శనమని వారిపై అభినందనలు దేశ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి. దివ్యాస్త్ర సక్సెస్ కావడం యావత్ భారత దేశం కీర్తి ప్రతిష్టలను మరింత పెంచాయని ప్రధాని మోదీ అన్నారు. ఇది భారత దేశ రక్షణ రంగంలో కీలకమైన డెవలెప్మెంట్ గా ఆయన చెప్పుకోవచ్చు. దేశ వ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు డీఆర్డీవో శాస్త్రవేత్తలను అభినందనలతో ముంచెత్తుతున్నారు.
Next Story

