Wed Jan 21 2026 00:57:25 GMT+0000 (Coordinated Universal Time)
వృద్ధుడిపై వీధికుక్కల దాడి.. కరుస్తూ ఈడ్చుకెళ్లిన వైనం
మృతుడు యూనివర్సిటీ క్యాంపస్లోని పార్క్లో 65 ఏళ్ల డాక్టర్ సఫ్దర్ అలీగా గుర్తించారు. డాక్టర్ సఫ్దర్ అలీ ఆదివారం ఉదయం..

దేశంలో వీధికుక్కల బెడద ఎక్కువైపోయింది. చిన్న, పెద్ద తేడా లేకుండా చాలా మంది వీధికుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోతున్నారు. వీధి కుక్కల దాడిలో ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోతుండగా.. వందల మంది గాయపడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లో మరో దారుణం వెలుగు చూసింది. అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ క్యాంపస్లో ఓ వృద్ధుడిపై కుక్కలు విరుచుకుపడ్డాయి. ఒకేసారి అరడజనుకు పైగా కుక్కలు వృద్ధుడిపై దాడి చేసి.. తీవ్రంగా గాయపరచడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
మృతుడు యూనివర్సిటీ క్యాంపస్లోని పార్క్లో 65 ఏళ్ల డాక్టర్ సఫ్దర్ అలీగా గుర్తించారు. డాక్టర్ సఫ్దర్ అలీ ఆదివారం ఉదయం వాకింగ్ కు వచ్చారు. కాసేపటికి అతను రక్తపుమడుగులో పడి ఉండటంతో పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించగా.. అతనిపై కుక్కలు దాడిచేసినట్లు తేలింది. వాటి నుంచి తప్పించుకునేందుకు అలీ ఎంత ప్రయత్నించినా పదే పదే దాడి చేయడంతో పాటు కుక్కలన్నీ అతన్ని నోటితో ఈడ్చుకెళ్లి తీవ్రంగా గాయపరిచాయి. మృతదేహాన్ని మార్చురీకి తరలించి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Next Story

