Tue Jan 20 2026 22:39:42 GMT+0000 (Coordinated Universal Time)
వరుణ్ సింగ్ కోలుకుంటున్నారా?
తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో గాయపడిన కెప్టెన్ వరుణ్ సింగ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు

తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో గాయపడిన కెప్టెన్ వరుణ్ సింగ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఆయన బెంగలూరులోని కమాండ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన లైఫ్ సపోర్ట్ సిస్టమ్ లో ఉన్నారని చెప్పారు. ఆయనకు అత్యంత ఆధునిక వైద్యాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. వరుణ్ సింగ్ కోలుకోవాలని దేశ వ్యాప్తంగా ప్రార్థనలు చేస్తున్నారు. ఆయన తల్లిదండ్రులు బెంగళూరులోనే ఉండి కుమారుడి రాక కోసం ఎదురు చూస్తున్నారు.
ప్రమాదంలో గాయపడి....
ఈ నెల8వ తేదీన తమిళనాడులో ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో 13 మంది మరణించిన సంగతి తెలిసిందే. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికతో పాటు 11 మంది మరణించారు. కానీ ఈ ప్రమాదంలో నుంచి బయటపడిన ఒకే ఒక్కడు వరుణ్ సింగ్. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రాణాపాయం లేదని మాత్రం ఖచ్చితంగా చెప్పలేమని అంటున్నారు.
Next Story

