Fri Dec 05 2025 13:06:50 GMT+0000 (Coordinated Universal Time)
Tamilnadu : 38 మంది మృతదేహాల గుర్తింపు
తమిళగ వెట్రి కళగం సభలో నిన్న జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 38 మంది మృతదేహాలను గుర్తించినట్లు దిండిగల్ జిల్లా కలెక్టర్ ఎస్. శరవణన్ తెలిపారు

తమిళగ వెట్రి కళగం సభలో నిన్న జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 38 మంది మృతదేహాలను గుర్తించినట్లు దిండిగల్ జిల్లా కలెక్టర్ ఎస్. శరవణన్ తెలిపారు. వీరి బంధువులకు మృతదేహాలను అప్పగించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఒక మహిళ మృతదేహాన్ని ఇంకా గుర్తించలేదని చెప్పారు. ఆ మహిళ గుర్తింపు పూర్తయ్యాక తప్పనిసరిగా శవపరీక్ష నిర్వహించి, బంధువులకు అప్పగిస్తామని కలెక్టర్ వివరించారు. ఇప్పటివరకు 14 మంది మృతదేహాలను బంధువులకు అప్పగించామని ఆయన చెప్పారు.
ఇద్దరి పరిస్థితి విషమం...
వైద్య విద్యా సంచాలకురాలు డాక్టర్ సుగంధి రాజకుమారి మాట్లాడుతూ నిన్న తొక్కిసలాటలో గాయపడి ఆస్పత్రిలో చేరిన ఇద్దరి పరిస్థితి విషమంగానే ఉందని, వారిని కాపాడే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్, మందుల సరఫరా సమృద్ధిగా ఉంది. అత్యుత్తమ వైద్యం అందిస్తున్నామని తెలిపారు.మొత్తం 39 మృతదేహాలు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చాయని, వారిలో 31 మందికి శవపరీక్ష పూర్తయిందని, ఇద్దరు రోగులు ఇంకా క్రిటికల్ పరిస్థితిలో ఉన్నారని వివరించారు.
Next Story

