Wed Jan 21 2026 05:00:39 GMT+0000 (Coordinated Universal Time)
బిపిన్ కు ప్రముఖుల నివాళులు
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ కు ప్రముఖులు ఘన నివాళులు అర్పిస్తున్నారు.

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ కు ప్రముఖులు ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో ఉంచిన పార్ధీవ దేహానికి కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు వచ్చి నివాళులర్పించారు. భారత సైన్యానికి బిపిన్ రావత్ చేసిన సేవలను వారు గుర్తు చేసుకున్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాధ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో పాటు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. నిన్న ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ లు బిపిన్ రావత్ పార్థీవ దేహానికి నివాళులర్పించారు.
ఇతర దేశాల ఆర్మీ అధికారులు....
ఈరోజు సాయంత్రం 4 గంటలకు బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి శ్రీలంక, నేపాల్, భూటాన్ ఆర్మీ అధికారులు హాజరుకానున్నారు. సైనికాధికారులు పలువురు నివాళులర్పించారు. ఢిల్లీ కంటోన్మెంట్ బ్రార్ స్క్కేర్ శ్మశాన వాటికలో బిపిన్ రావత్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి.
- Tags
- bipin rawat
- delhi
Next Story

