Fri Mar 21 2025 06:40:07 GMT+0000 (Coordinated Universal Time)
29 రోజులకు కుంభమేళాలో స్నానాలు చేసింది ఎంతమందంటే?
ప్రయాగ్రాజ్లో జరుగు తున్న మహా కుంభమేళాకు పెద్దయెత్తున భక్తులు తరలి వస్తున్నారు

ప్రయాగ్రాజ్లో జరుగు తున్న మహా కుంభమేళాకు పెద్దయెత్తున భక్తులు తరలి వస్తున్నారు. పుణ్యస్నానాలు చేస్తున్నారు. గతనెల 13 న ప్రారంభమైన మహా కుంభమేళ నేటికి 29వ రోజుకు చేరుకుంది. 144 ఏళ్లకు ఒక్కసారి వచ్చే కుంభమేళా కావడంతో దేశ విదేశాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తు న్నారు. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం ఇప్పటివరకూ దాదాపు 44 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసినట్లు తెలుస్తోంది.
ముగియనుండటంతో...
ఫిబ్రవరి 26వతేదీన మహా కుంభమేళాకు ముగియనుంది. దీంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. రోజురోజుకూ జన ప్రవాహం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల నుంచే వేలాది మంది భక్తులు పవిత్ర స్నానమాచరిస్తున్నారు.ఈ రోజు కూడా ప్రయాగ్రాజ్ చుట్టు వందల కిలోమీటర్ల వరకూ ట్రాఫిక్ జామ్ నిలిచిపోయింది. కుంభమేళా ప్రాంగణంలో రద్దీ కారణంగా నిమిషాల్లో వెళ్లగలిగే ప్రాంతాలకు కూడా గంటల సమయం పడుతోంది.
Next Story