Fri Dec 19 2025 11:02:06 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీలో భారీ వర్షం.. జన జీవనం అస్తవ్యస్థం
ఢిల్లీ భారీ వర్షాలకు అతలాకుతలమవుతుంది. నాలుగు రోజుల నుంచి భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది.

ఢిల్లీ భారీ వర్షాలకు అతలాకుతలమవుతుంది. నాలుగు రోజుల నుంచి భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. ఉత్తరాది రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలో రహదారులపై నీరు నిలిచి ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
రహదారులన్నీ....
వాహనదారులు వర్షపు నీటిలో ప్రయాణం చేయలేక ఇబ్బంది పడుతున్నారు.ఢిల్లీ ప్రాంతాల్లో నీరు రోడ్లపైకి ప్రవహిస్తుంది. హర్యానాలోని గురగ్రామ్ లోని రాజీవ్ చౌక్ అండర్ పాస్ పూర్తిగా జలమయిపోయింది. ఉద్యోగులు సకాలంలో తమ కార్యాలయాలకు చేరుకోలేకపోతున్నారు. అనేక అవస్థలు పడుతున్నారు. కొన్ని దుకాణాల్లోకి కూడా నీరు ప్రవేశించింది. చిరు వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు.
- Tags
- delhi
- heavy rains
Next Story

