Tue Jan 13 2026 07:42:55 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీలో మూడేళ్లలో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు
ఢిల్లీలో గత మూడేళ్లలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి

ఢిల్లీలో గత మూడేళ్లలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంగళవారం ఢిల్లీలో ఈ ఏడాది జనవరిలోనే కాకుండా, గత మూడేళ్లలోనే అత్యంత చలి తీవ్రత నమోదైంది. కనిష్ఠ ఉష్ణోగ్రత 3 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయిందని భారత వాతావరణ శాఖ తెలిపింది.నగరంలోని ప్రధాన పరిశీలనా కేంద్రం సఫ్దర్జంగ్లో కనిష్ఠ ఉష్ణోగ్రత 3 డిగ్రీలుగా నమోదైంది. ఇది సాధారణ స్థాయి కంటే 4.4 డిగ్రీలు తక్కువగా ఉందని ఐఎండీ గణాంకాలు వెల్లడించాయి. 2023 జనవరి 16న ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రత 1.4 డిగ్రీలుగా నమోదైనట్టు వాతావరణ శాఖ గుర్తు చేసింది.
ఇతర ప్రాంతాల్లోనూ తీవ్ర చలి
పాలంలో 4 డిగ్రీలు, లోధీ రోడ్లో 3 డిగ్రీలు నమోదయినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రిడ్జ్ ప్రాంతంలో 4.4 డిగ్రీలు, ఆయానగర్‌లో 3.2 డిగ్రీలు గా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణ స్థాయికి 4.5 నుంచి 6.4 డిగ్రీలు తక్కువగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైతే చలిగాలి పరిస్థితులుగా పరిగణిస్తామని ఐఎండీ స్పష్టం చేసింది. చలిగాలులు అతి కనిష్టానికి పడిపోవడంతో ఢిల్లీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు.
Next Story

