Thu Mar 19 2026 13:09:05 GMT+0530 (India Standard Time)
మునావర్ షోకు అనుమతి నిరాకరణ
మునావర్ ఫారుఖీ కామెడీ షోకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు.

మునావర్ ఫారుఖీ కామెడీ షోకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆయన షోకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ పోలీసులకు అందిన దరఖాస్తును తిరస్కరించారు. అప్పటికే విశ్వహిందూ పరిషత్ మునావర్ కామెడీ షోకు అనుమతి ఇవ్వవద్దంటూ పోలీసులకు వినతి పత్రాన్ని సమర్పించింది. శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశముందని విహెచ్పీ నేతలు పోలీసులకు ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు.
హైదరాబాద్ లో...
దీంతో మునావర్ ఫారుఖీ కామెడీ షోకు ఢిల్లీ పోలీసులు నిరాకరించారు. బెంగళూరులోనూ ఆ షోకు అనుమతివ్వలేదు. హైదరాబాద్ లో ఆ షో జరగడంతో శాంతి భద్రతల సమస్యలు తలెత్తాయి. ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ అయ్యారు. దీంతో కామెడీ షోకు అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు తేల్చి చెప్పారు.
Next Story

