Fri Apr 10 2026 19:11:48 GMT+0530 (India Standard Time)
హై అలెర్ట్..పాక్..ఐఎస్ఐ ఏజెంట్ల అరెస్ట్
భారత్లో పాక్ ఐఎస్ఐ ఏజెంట్ల ముఠాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.

భారత్లో పాక్ ఐఎస్ఐ ఏజెంట్ల ముఠాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఢిల్లీ నగరంలో ఐఎస్ఐ ఏజెంట్ల ముఠా ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారు ఎక్కడెక్కడ ఉన్నది తెలుసుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు.
స్పెషల్ ఆపరేషన్ లో...
ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఆపరేషన్లో గుట్టురట్టయింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పదకొండు మంది పాక్ ఐఎస్ఐ ఏజెంట్లు అరెస్ట్ అయ్యారు. పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పాక్ ఐఎస్ఐ ఏజెంట్లు అమర్చుతున్నట్లు గుర్తించారు. పాక్ నుంచి ఆయుధాలు సేకరిస్తున్నట్టు వారు విచారణలో వెల్లడించారు.
Next Story

