Sat Mar 07 2026 23:56:14 GMT+0530 (India Standard Time)
నేడు ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణ
ఢిల్లీ లిక్కర్ కేసుపై నేడు రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది.

ఢిల్లీ లిక్కర్ కేసుపై నేడు రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. లిక్కర్ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై న్యాయస్థానంలో విచారణ జరగనుంది. కవితతో పాటు ఇతర నిందితులను వర్చువల్ గా కోర్టులో అధికారులు హాజరుపర్చనున్నారు. ఛార్జిషీట్ పై విచారణ జరుతుండటంతో ఇరువర్గాల వాదనలను న్యాయస్థానం విననుంది.
ఇరువర్గాల వాదనలు...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా నిందితులుగా ఉన్నారు. కొన్ని నెలల నుంచి వారు తీహార్ జైలులో ఉన్నారు. సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ లో అన్ని తప్పులు తడకలేనని వీరి తరుపున న్యాయవాదులు వాదిస్తున్నారు. ఈ కేసు విచారణ జడ్జి కావేరి బవేజా జరపనున్నారు.
Next Story

