Sat Mar 07 2026 20:44:51 GMT+0530 (India Standard Time)
Delhi : ఢిల్లీలో పొగమంచు.. విమానాల రాకపోకల్లో ఆలస్యం
ఢిల్లీలో పొగమంచు కమ్మేసింది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో ఢిల్లీలో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.

ఢిల్లీలో పొగమంచు కమ్మేసింది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో ఢిల్లీలో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఉదయం పది గంటలయినా ఢిల్లీలో సూర్యుడు కనిపించకపోవడంతో ప్రజలు కూడా అనేక ఇబ్బంది పడుతున్నారు. మార్నింగ్ వాకర్స్ కూడా బయటకు రావడానికి భయపడిపోతున్నారు. దారుణంగా పొగమంచు కమ్మేయడంతో రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువగా జరిగే అవకాశాలున్నాయని, జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఆఫీసుకు వెళ్లాలంటే...
ఇక విమానాలు కూడా అనేక ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన, రావాల్సిన అనేక విమానాల్లో జాప్యం జరుగుతుంది. పొగమంచు కారణంగా రన్ వే పై దిగలేని పరిస్థితి. అలాగే వెళ్లలేని పరిస్థితి. కొన్ని రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఉదయాన్ని ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలకు వెళ్లాల్సిన వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. కార్యాలయాలకు సమయానికి చేరుకోలేకపోతున్నారు.
Next Story

