Mon Dec 15 2025 08:23:28 GMT+0000 (Coordinated Universal Time)
రాజధానిని కమ్మేసిన పొగమంచు.. 10 ఏళ్లకు మళ్లీ ఇలా..
2013లోనూ ఇలాంటి పరిస్థితే ఉన్నా అప్పట్లో ఐదు రోజులకు మాత్రమే పరిమితమైంది. ఈ సారి మాత్రం ఐదురోజులు దాటింది.

దేశ రాజధాని ఢిల్లీని ఈ ఏడాది ఆరంభం నుండి పొగమంచు ఇబ్బంది పెడుతోంది. ముఖ్యంగా ఐదు రోజులుగా పొగమంచు దట్టంగా కురుస్తుండటంతో.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విమానాల రాకపోకలకూ అంతరాయం కలుగుతోంది. ప్రతి రోజూ పదుల సంఖ్యలో విమానాలు రద్దవుతున్నాయి. తీవ్రమైన చలి, పొగమంచు కారణంగా ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావడానికి జంకుతున్నారు. పొగమంచు కారణంగా దారి కనిపించకపోవడంతో.. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
అయితే.. ఢిల్లీలో వరుసగా ఐదు రోజులపాటు ఇలాంటి వాతావరణం నెలకొనడం గత పదేళ్లలో ఇదే తొలిసారి. 2013లోనూ ఇలాంటి పరిస్థితే ఉన్నా అప్పట్లో ఐదు రోజులకు మాత్రమే పరిమితమైంది. ఈ సారి మాత్రం ఐదురోజులు దాటింది. రేపటి వరకూ చలితీవ్రత ఇలాగే కొనసాగే అవకాశం ఉండొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే దట్టమైన మంచు కురుస్తుందని వెల్లడించింది. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం రాత్రి వరకు దాదాపు 20 గంటలపాటు ఏకధాటిగా మంచు కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Next Story

