Sat Apr 11 2026 19:31:32 GMT+0530 (India Standard Time)
ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక ఆ వాహనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్
ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోలు, డీజిల్ తో నడిచే వాహనాలకు రిజిస్ట్రేషన్లు ఉండవని ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కాలుష్య కోరల్లోంచి ఢిల్లీ నగరాన్ని రక్షించడానికి అక్కడి ప్రభుత్వం నడుంబిగించింది. ఈ మేరకు ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2026-2030 ముసాయిదాను తాజాగా విడుదల చేసింది.
పెట్రోలు, డీజిల్ తో నడిచే...
దీని ప్రకారం పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాలపై ఆంక్షలు విధించనున్నారు. 2028 ఏప్రిల్ 1వ తేదీ నుంచి పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహనాలకు రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. కేవలం కొత్త ఈవీ బైక్‌లను మాత్రమే అనుమతించనున్నారు. 2027 జనవరి నుంచి కేవలం కొత్త ఈవీ ఆటోలకే రిజిస్ట్రేషన్ చేయనున్నారు. ఇక ద్విచక్ర వాహనమైనా, ఆటోలైనా,కార్లయినా ఈవీ వాహనాలను మాత్రమే కొనుగోలు చేయాలి.
Next Story

