Fri Dec 05 2025 16:54:33 GMT+0000 (Coordinated Universal Time)
Delhi : ఆ వాహనాలకు పెట్రోలు పోయొద్దు.. వచ్చే నెల నుంచి నిర్ణయం
ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధానిలో కాలుష్యాన్ని నివారించేందుకు నూతన ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది

ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధానిలో కాలుష్యాన్ని నివారించేందుకు నూతన ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం కూడా ఆదేశించడంతో కొత్తగా ఏర్పాటయిన బీజేపీ ప్రభుత్వం ఈ మేరకు కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించింది.
పదిహేనేళ్లు పైబడిన...
అందులో భాగంగా పదిహేనేళ్లు పైబడిన వాహనాలకు పెట్రోల్ పోయొద్దని పెట్రోల్ బంకులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ ఒకటి నుంచి నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించింది. ఢిల్లీలో పర్యావరణాన్ని కాపాడటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పర్యావరణశాఖ మంత్రి సిర్సా మీడియా ప్రతినిధులకు వెల్లడించారు.
Next Story

