Sun Mar 15 2026 14:05:48 GMT+0530 (India Standard Time)
నేడు సీబీఐ విచారణకు ఢిల్లీ డిప్యూటీ సీఎం
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో నేడు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సీబీఐ విచారణకు హాజరు కానున్నారు.

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో నేడు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సీబీఐ విచారణకు హాజరు కానున్నారు. ఆయనను మరోసారి సీబీఐ అధికారులు విచారించనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ స్పీడ్ పెంచింది. వరస అరెస్ట్ లతో పాటు ఛార్జిషీట్ లను దాఖలు చేస్తుంది. గతంలో మనీష్ సిసోడియా నివాసంలోనూ సీబీఐ అధికారులు సోదాలను నిర్వహించారు.
మరోసారి విచారణకు...
అయితే మరోసారి విచారించాలని ఈరోజు రావాలని మనీష్ సిసోడియాకు సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేయడంతో వారి నుంచి అందిన సమాచారం మేరకు మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు నేడు ప్రశ్నించే అవకాశముంది. విచారణకు తాను సహకరిస్తానని మనీష్ సిసోడియా తెలిపారు.
Next Story

