Tue Feb 07 2023 15:21:01 GMT+0000 (Coordinated Universal Time)
డిప్యూటీ సీఎం సంచలన కామెంట్స్
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరితే తనపై ఉన్న కేసులన్నీ మాఫీ అవుతాయని తనకు మెసెజ్ వచ్చిందని తెలిపారు. బీజేపీలో చేరితే తనపై ఉన్న సీబీఐ, ఈడీ కేసులు ఎత్తివేస్తామని బీజేపీ నేతలు తనకు సందేశాన్ని పంపారని ఆయన కామెంట్ చేశారు. మనీష్ సిసోడియాపై ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేసు నమోదయిన సంగతి తెలిసిందే. ఆయన ఇళ్లపై సీబీఐ సోదాలు కూడా నిర్వహించింది.
తలైనా నరుక్కుంటాను కాని....
ఈ నేపథ్యంలో మనీష్ సిసోడియా చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. తాను తలను అయినా నరుక్కుంటాను కాని బీజేపీలో చేరే ప్రసక్తి లేదని మనీష్ సిసోడియా తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలు అర్థరహితమని బీజేపీ నేతలు కొట్టి పారేస్తున్నారు. ఆయన అవినీతి కేసులో చిక్కుకుని ఏదేదో మాట్లాడుతున్నారని బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు.
Next Story