Fri Dec 05 2025 09:35:48 GMT+0000 (Coordinated Universal Time)
Aravind Kejrival : కేజ్రీవాల్ బెయిల్ పై నేడు తీర్పు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్పై నేడు హైకోర్టు తీర్పు వెలువడనుంది.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్పై నేడు హైకోర్టు తీర్పు వెలువడనుంది. దీంతో హైకోర్టు తీర్పు ఎలా ఉండనుందన్నది ఉత్కంఠగా మారింది. ఢిల్లీలిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీపార్టీ అధినేత కేజ్రీవాల్ కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ఇచ్చిన సంగతి తెలిసిందే. మనీలాండరింగ్ కేసులో ట్రయల్ కోర్టు బెయిల్ ఇచ్చినా కేజ్రీవాల్ జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఢిల్లీ హైకోర్టు తీర్పుపై...
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే దీనిపై వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై ఈడీ వేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు మంగళవారం తీర్పు ఇవ్వనుంది. ఢిల్లీ హైకోర్టు తీర్పు పై కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించినా హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత విచారణ చేపడతామని చేపట్టడంతో ఈ తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
Next Story

