Wed Mar 18 2026 20:24:27 GMT+0530 (India Standard Time)
ఆరోసారి కూడా గైర్హాజరు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుటకు హాజరు కాలేకపోతున్నానని తెలిపారు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుటకు హాజరు కాలేకపోతున్నానని తెలిపారు. ఆయనకు ఇప్పటికే అనేక సార్లు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లోనూ, మనీలాండరింగ్ కేసులోనూ విచారణకు హాజరు కావాలని ఐదు సార్లు నోటీసులు ఇచ్చింది. అయినా రాకపోవడంతో ఈడీ కోర్టును ఆశ్రయించింది.
కోర్టులో ఉన్నందున...
అయితే ఢిల్లీ రేస్ కోర్స్ కోర్టు మాత్రం ఈడీ ఎదుట విచారణకు ఈ నెల 19న హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆరోసారి ఈడీ అరవింద్ కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేశారు. ఆరోసారి ఈడీ విచారణకు దూరంగా ఉండనున్నారు. ఈమేరకు ఆయన కొద్దిసేపటి క్రితం స్పందించారు. తాను విచారణకు హాజరు కావడం లేదని ఆయన తెలిపారు. ఈడీ విచారణకు హాజరు కావడం అంశం కోర్టు పరిధిలో ఉన్నందున తాను హాజరు కావడం లేదని ఆయన తెలిపారు.
Next Story

